నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics in Telugu
నీతో గడిపే ప్రతి క్షణము_Netho gadipe Prathi kshanamu Lyrics - Jyothi Raju
| Singer | Jyothi Raju |
| Song Writer | Jyothi Raju |
Lyrics
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4)
1.మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి - నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
2. గమ్యమే లేని ఓ బాటసారిని - నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్దానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||