నూతన గీతము నే పాడెదా_ Nuthana geeth song lyrics in Telugu
నూతన గీతము నే పాడెదా_ Nuthana geethamHosanna ministry's Lyrics - Yessana
| Singer | Yessana |
| Composer | Hossana ministry's |
| Album | Manoharuda |
| Song Writer | Hossana ministry's official |
Lyrics
నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే
1. కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో
స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూ నీవే
నా ప్రాణము - నిను వీడి నేనుండలేను
2. కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూ నీవే
నా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ
3. మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ